ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 6ప్రజాపాలన ప్రతినిధి **వంట గ్యాస్ ధరను విపరీతంగా పెంచిన కేంద్ర ప్రభ

Published: Tuesday March 07, 2023
ఇబ్రహీంపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా విద్యుత్ చార్జీలు పెంచి కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పోవటంతో ప్రజలు నాన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు గత కేంద్ర ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ పాలనలో 500వందల రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలనలో750రూపాయలు పెరిగి గ్యాస్ సిలిండర్ ధర1250 చేరు కోవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర100 రూపాయలు పెంచితే ప్రజలకు విపరీతంగా భారం పడుతుంది అని ఆలోచన చేసిన వైయస్ రాజశేఖర రెడ్డి  పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయం తీసుకొని ప్రజలను ఆదుకున్న గొప్ప ముఖ్యమంత్రి స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కానీ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్లి గ్యాస్ ధరలపై ప్రధానమంత్రి ని నిల దీయకుండా తెలంగాణ రాష్ట్రం లో తామే అధికారంలో ఉండి వంట గ్యాస్ ధరల పై కేంద్ర ప్రభుత్వం సై రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేయటం చాలా విడ్ఫురంగా ఉంది అన్నారు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న బి ఆర్ స్ నాయకులు మంత్రులే కేంద్ర ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలుఎలా తీర్చుతుందో అర్థం కావటం లేదు అన్నారు కేంద్ర పరిధిలో ఏదైనా సమస్యలు ఉంటే తెలంగాణ రాష్టానికి చెందిన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఢిల్లీ వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి కానీ ప్రతి పక్ష పార్టీల లాగా అధికారంలో ఉన్న మంత్రులుఎంపీలు ఎమ్మెల్యే లు ఆందోళనలు చేయటం సిగ్గు చేటు అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల పైన ఇతర సమస్యపై అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై పోరాటం చేస్తే ఎక్కడి నాయకులను అక్కడే బలవంతంగా అరెస్ట్ లు చేయించే ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ వాళ్ళు ఆందోళన చేస్తే ఎలాంటి అరెస్ట్ లు ఉండవా ఇదేనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన  తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలలో చెలగాటం అడోద్దు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం   విద్యుత్ చార్జీలు పెంచకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్. చేస్తున్నాము పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వ ని డిమాండ్ చేసున్నము కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు తగ్గించకుంటే పెంచిన వంట గ్యాస్ ధర తెలంగాణ రాష్ట్రం ప్రజల పై భారం పడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలపై పోరాటం చేస్తాం రాబోయే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వనికి ప్రజలు బుద్ధి చెప్పటం కాయం అన్నారు.