ఆధ్యాత్మిక చింతనే సన్మార్గానికి మూలం

Published: Friday August 06, 2021
పెండ్లిమడుగు సర్పంచ్ కెరెల్లి బుచ్చిరెడ్డి
వికారాబాద్ బ్యూరో 05 ఆగస్ట్ ప్రజాపాలన : మానసిక సమస్యల పరిష్కారానికి ఆధ్యాత్మిక చింతను మించిన మార్గం లేదని పెండ్లిమడుగు గ్రామ సర్పంచ్ కెరెల్లి బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలో గల పెండ్లిమడుగు గ్రామంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సమస్యలతో సతమతమయ్యే ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక చింతన చేయాలని పిలుపునిచ్చారు. రోజులో కనీసం ఒక గంటైనా ఆధ్యాత్మిక ధ్యానం అత్యంతావశ్యకం అని అన్నారు. ఏకాగ్రతతో ధ్యానం చేసిన వారికి మానసికోల్లాసంతో పాటు ప్రశాంతత చేకూరుతుందని వివరించారు. గ్రామ పొలిమేరలో పోచమ్మ దేవాలయంలో అంగరంగవైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. మునగాల భోజిరెడ్డి పోచమ్మ విగ్రహానికి ఆర్థిక సహకారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సుభాషిణి, కొత్తగడి పిఏసిఎస్ చైర్మన్ సుభాన్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మల్లేశం, దశరథ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.