ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలి

Published: Friday January 21, 2022
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో సమావేశం
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 19 (ప్రజాపాలన) : జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఐటీడీఏ పీవో అంకిత్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి తో కలిసి గిరిజన ప్రాంతాలలో అభివృద్ధికి సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఆ ప్రణాళికకు అనుగుణంగా అధికారులు పనిచేయాల్సి ఉంటుందని, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, తిర్యాని మండలం లోని గుండాల, మంగి ప్రాంతాలలో కొత్త సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇది హోసన్నా133 సెంటర్లలోకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిరి వికాస పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండలంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేయాలన్నారు. అడ ప్రాజెక్టులు విహారయాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గిరిజన ప్రాంతాలలో చేసే ప్రతి పనికి గ్రామ సభలు నిర్వహించి అనుమతులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని మణెమ్మ, వైద్యాధికారి మనోహర్, తదితరులు పాల్గొన్నారు.