త్వరలోనే పోడు భూముల పట్టాలు గ్రామ సభలో బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత. బూర్గంపాడు (

Published: Wednesday November 23, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ నాగమణి అధ్యక్షతన జరిగిన పోడు భూముల రివ్యూ సమావేశ  గ్రామసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన... బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
పోడు రైతులకు హక్కు పత్రాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పోడు రైతులకు న్యాయం చేసేదందుకు సీఎం కేసీఆర్  పోడు సర్వే చేపట్టారని అన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  కృషితో రాష్ట్రవ్యాప్తంగా పోడు వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్న ప్రతి పోడు వ్యవసాయ భూములలో సర్వే కార్యక్రమం చేపట్టారని , పోడు భూముల పంపిణీ పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసిందని అన్నారు., పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్  ఉదాత్త నిర్ణయం తీసుకున్నారని త్వరలోనే  సీఎం కేసీఆర్  చేతుల మీదుగా పోడు భూముల హక్కు పత్రాలు అందజేస్తారని అన్నారు.పోడు రైతులకు కూడా రైతు బంధు పథకం అమలు చేయడం జరుగుతుందన  వారు అన్నారు.ఈ కార్యక్రమంలో పలు శాఖల ప్రభుత్వాధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.