ఆళ్లపాడు అంగన్వాడీ కేంద్రం లో శ్రీ మంత ఉత్సవాలు

Published: Tuesday April 26, 2022
బోనకల్, ఏప్రిల్ 25 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలో ఆళ్లపాడు అంగన్వాడి కేంద్రంలో శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు పాల్గోని శ్రీమంతం జరిగిన మంద ఉషా గణేష్ దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పోషక పదార్థాలు తీసుకోని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని బిడ్డ కి అందిoచి ఆరోగ్యం వంతమైన జివితాన్ని గడపాలని, తల్లి బిడ్డ ల క్షేమం కోసం శ్రీ మంత కార్యక్రమం జరిపించుకొవాలని కోరారు. శ్రీమంతం నిర్వహిస్తూన్న అంగన్వాడీ కేంద్రాలను సర్పంచ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ, హుస్సేన్ బీ, గౌరమ్మ ,అయాలు కుటుంబ పేద్దలు పాల్గొన్నారు.