దళిత జనోద్దరణే సిఎం కేసీఆర్ ద్యేయం దళిత బంధు తో ఆర్థికంగా ఎదగాలి

Published: Saturday June 04, 2022
రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
 
కరీంనగర్ జూన్ 3 ప్రజా పాలన జాప్రతినిధి :
దళితుల ఆర్థిక ప్రగతి లక్ష్యంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
 
శుక్రవారం కరీంనగర్ రూరల్ మండలందుర్షె్డ్ గ్రామంలో దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల రెడీమేడ్ బట్టల షాప్, మార్బుల్ గ్రానైట్, సిమెంట్  యూనిట్ల దుకాణాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. దళిత బంధు కేవలం ఒక పథకం మాత్రమే కాదని దళితులకు ఉపాధిని, ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని, వికాసాన్ని చేకూర్చే ఒక సమర్థవంతమైన విధానం అన్నారు. బంధు పథకానికి బ్యాంకు లింకేజీ లేదు, సెక్యూరిటీ లతో నిమిత్తం లేదని, లబ్ధిదారులు వారికి వచ్చిన పనిని, నచ్చిన పనిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉందని అన్నారు.
 ఈ  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, , అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మధుసూదన్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నా