కుటిర పరిశ్రమల వైపు మహిళలు. సర్పంచ్ రాజిరెడ్డి

Published: Wednesday June 02, 2021
పరిగి, జూన్ 1, ప్రజాపాలన ప్రతినిధి : కుటిర పరిశ్రమలవైపు మహిళలు ఆకార్షితులు అవ్వాలని దోమ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు కె రాజిరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో మంగళవారo బ్యాంకు లింకేజీ తో మహిళా సంఘం సభ్యురాలికి రూపాయలు లక్షతో మిర్చి. పిండి గిర్నీ మంజూరూ కావడంతో దోమ సర్పంచ్ రాజిరెడ్డి  ప్రారంభించారు. అనంతరం గిర్నీని పరిశీలించి మహిళ. సంఘాలకు పొదుపు తో పాటు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మహిళలు ఆసక్తి చూపే యూనిట్లు ఏర్పాటు ఏర్పాటు చేయించి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని సర్పంచ్ సూచించారు. ప్రతి నెల పొదుపు చేసే మహిళలకు స్త్రీనిది ద్వారా రుణాలు మంజూరికి సంబంధిత సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గోపాల్ ఏపీఎం సాయన్న వార్డ్ సభ్యులు లక్ష్మణ్. అంజిలయ్య సీసీ లు నారాయణ. జంగయ్య వీబీకేలు భాగ్యమ్మ మాదవి సుజాత స్నేహ సంఘం అధ్యక్షులు కె బాలమణి యూనిట్ నిర్వాహకులు పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు