క్రీడాకారులకు ఎయిడ్స్ అవగాహన : మధిర ఆశ మిత్ర లంకా కొండయ్య

Published: Friday October 08, 2021

మధిర, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : ప్రస్తుత సమాజoలో ఎన్నో మానసిక సామాజిక రుగ్మతలు ఉంటాయి. వాటిల్లో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న హెచ్ఐవి /ఎయిడ్స్ వ్యాది ఒకటి. మరి అలాంటి జబ్బు బారిన ఎవరు పడకూడదు అని ప్రముఖ సామజిక సేవకుడు మధిర ఆశ మిత్ర లంకా కొండయ్య తెలియపరిచారు. గురువారం ఉదయం స్థానిక మధిర టౌన్ లో టీవీఎం స్కూల్ నందు గత 15 రోజులు నుండీ మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ కు చెందిన మద్ది శ్రీనాధ్ రగ్బీ క్రీడ వివిధ గ్రామల బాలికలకు మధిర క్రాంతి ట్రాన్స్పోర్ట్ యజమాని నాగరాజు సహకారంతో రగ్బీ క్రీడ కోచింగ్ నడుస్తూ వుంది. ఈ సందర్బంగా టీవీఎం వాకర్స్ క్లబ్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున లంకా కొండయ్య వినూత్నంగా యువ క్రీడాకారులకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాది పై సంపూర్ణoగా అవగాహన పరిచినారు. అనంతరం హెచ్ఐవి /ఎయిడ్స్ బ్రోచర్ లు అందరికి పంపిణి చేసినారు. అదేవిధంగా స్టాప్ ఎయిడ్స్ టాక్ ఎయిడ్స్ చిత్ర పటాలను ప్రదర్శించినారు. ఈ కార్యక్రమంలో pet చేరుపల్లి హరి మరియు టీవీఎం వాకర్స్ క్లబు సభ్యులు పాల్గొన్నారు.