మేకవనంపల్లి అభివృద్ధికి అహర్నిశలు కృషి

Published: Friday July 09, 2021
సాధించాలనే సంకల్ప బలమే విజయానికి నాంది
నిధుల లేమి ఉన్నా అభివృద్ధికి ఆటంకం లేదు
మేకవనంపల్లి పీఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల అంజి రెడ్డి
వికారాబాద్ జూలై 08 ప్రజాపాలన బ్యూరో : 1988లో సర్పంచ్ గా ఎన్నికైన కొత్తలో మేకవనంపల్లి అభివృద్ధికి నోచుకోలేదు. రాజకీయ వారసత్వంతో, స్వీయ అనుభవంతో గ్రామాభివృద్ధి చేసి అందరి ఆదరాభిమానాలు పొందారు. మేకవనంపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయుటకు నిధులు లేక విలవిలలాడే ఆనాటి రోజులు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పం మాత్రం ఉంది. మా కుటుంబం రాజకీయాలలో ఆరితేరిన వారు ఉండడంతో వారి సలహాలు, సూచనలకు తోడుగా నా స్వీయ ఆలోచనలకు పదును పెట్టాను. జిల్లా పరిధిలో గల వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట్ మండలానికి చెందిన మేకవనంపల్లి గ్రామం యదార్థ విషయాలను ప్రజాపాలన బ్యూరో రిపోర్టర్ పాఠకులకు అందిస్తున్న వివరాలు. పట్లోళ్ళ మాణమ్మ నాగిరెడ్డి పుణ్య దంపతులకు ఏడుగురు సంతానం. వారిలో చివరి వారు పట్లోళ్ళ అంజిరెడ్డి. ఎస్ఏపి కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించారు. కుటుంబ పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదవలేకపోయాననే బాధ నేటికీ వెక్కిరిస్తుందని ఆవేదన చెందుతారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే రాజకీయ పరకాయ ప్రవేశ మార్గమే సుమార్గంగా భావించారు. 1988లో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి విజయ ఢంకా మోగించారు. సర్పంచుగా ఎన్నికయ్యానని సంతోషాన్ని కలిగించింది. కానీ  గ్రామంలోని అపరిష్కృత సమస్యలు మాత్రం కంటికి అద్దంలో పెనుభూతంగా కనిపించేవి. నిధుల సమస్య తాండవిస్తున్నా పట్టువదలని మార్కునిలా గ్రామాభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. తన పదవీ కాలంలో ప్రతి గల్లీలో సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణాలను అంచెలంచెలుగా పూర్తి చేశారు. గ్రామంలో ప్రైమరీ పాఠశాల వరకు మాత్రమే ఉండేది. అవిశ్రాంత కృషి ఫలితంగా ఉన్నత పాఠశాలగా మార్చి మా ఊరి విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చాను. అన్ని మౌలిక వసతులను పాఠశాలకు కల్పించాననే తృప్తి మిగిలింది. ఉన్నత పాఠశాలగా మార్చుటకు తరగతి గదుల నిర్మాణం కూడా చేపట్టి పూర్తి చేయగలగడం అమితానందాన్ని ఇచ్చింది. గ్రామ అవసరాలలో అతి ముఖ్యమైన పరిష్కరించాల్సిన సమస్యలను ప్రణాళికను రూపొందించుకున్నాను. అంగన్ వాడి భవన నిర్మాణం, డ్వాక్రా భవన నిర్మాణం, పశువుల ఆసుపత్రి, మంచి నీటి సరఫరా, ప్రైమరీ పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చడం, జిపి భవనం లీకేజీల మరమ్మతులు వంటి సమస్యలను అంచెలంచెలుగా పరిష్కరించాను. 1975 - 76లోనే నీటి సరఫరా ట్యాంక్ నిర్మాణం పూర్తైనా వినియోగంలోకి రాలేదు. నేను సర్పంచుగా ఎన్నికైన తరువాత 1989లో వాటర్ ట్యాంకుకు చిన్న పాటి మరమ్మతులు పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చాను. నా ఆధ్వర్యంలో 25 డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయగలిగాను. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా 15 ఓపెన్ బావులు, రుణాలను అర్హులైన లబ్దిదారులకు మంజూరు చేయించాను. బిసి కార్పోరేషన్ ద్వారా 25 మంది లబ్ధిదారులకు గొర్రెలు ఇప్పించాను. కేంద్ర ప్రభుత్వ రోజ్ గార్ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాను. ఎస్సీ, బిసి కాలనీలలో విద్యుత్ అవసరాలు తీర్చేందుకు 45 స్థంభాలు మంజూరు చేయించి, నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగేలా చేశాను. సామాజిక సేవలో భాగంగా గ్రామంలో హనుమాన్ మందిర్ నిర్మాణం పూర్తి చేశాను. ఆరోగ్యమే మహా భాగ్యం దృష్ట్యా ఆరోగ్య క్యాంపులను నిర్వహించాను. రోటరీ క్లబ్ సౌజన్యంతో మినరల్ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేయడం విశేషం. 50 కుటుంబాల పెళ్ళిళ్ళకు పుస్తెమెట్టెలు అందివ్వడం రాబోవు తరానికి ఆదర్శం. తెలుగు దేశం పార్టీలో పలు రాజకీయ పదవులు చేపట్టి గ్రామాభివృద్ధికి తోడ్పడ్డాను. 2014 ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందుగా టిఆర్ఎస్ పార్టీలో చేరి గ్రామ సమస్యల పరిష్కారం కొరకు అవిశ్రాంత కృషి చేశాను. 2020 లో మేకవనంపల్లి పిఏసిఎస్ చైర్మైన్ గా పదవీ బాధ్యతలు చేపట్టాను. సంవత్సరకాల పరిమితి లోపల పిఏసిఎస్ నూతన భవనం, 3 షాపింగ్ కాంప్లెక్సులు, నాబార్డు వారి 2 కోట్ల ఆర్థిక సహకారంతో గోదాం నిర్మాణం కొరకై మంజూరు చేయించుకున్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నాను.
లక్ష్యం : నిరాదరణకు గురైన వయోవృద్ధులకు అసరా కల్పించాలనేది ప్రధాన లక్ష్యం. భగవదనుగ్రహం ఉంటే త్వరలో నా మనో వాంఛను నెరవేరుస్తానని ధీమా వ్యక్తం చేశారు.