కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం లాంటిది : ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Friday May 07, 2021
మేడిపల్లి, మే 6 (ప్రజాపాలన ప్రతినిధి) : పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం వరం లాంటిదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్  మరియు ఎమ్మార్వో గౌతమ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్తులో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్  పేద, బడుగువర్గాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరు చేయడం గర్వకారణమని తెలిపారు. కార్పొరేటర్  బన్నాల గీత ప్రవీణ్ మాట్లాడుతూ ఇంత విపత్కర మైన సమయంలో కూడా పేదలను ఆదుకునే ఏకైక దేవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాాజ్, ఆర్ ఐ షహీన్, కార్పొరేటర్లు జెర్రిపోతుల ప్రభుదాస్, బొంతు శ్రీదేవి, పన్నాల దేవేందర్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్, కృష్ణారెడ్డి, శ్రావణ్ రెడ్డి తదితరులుు పాల్గొన్నారు.