బడులే నడవని కాలంలో హేతుబద్దీకరణా

Published: Thursday August 19, 2021
బోనకల్లు, ఆగష్టు 18, ప్రజాపాలన ప్రతినిధి : కోవిడ్ కారణంగా 2020 మార్చి నుండిగత రెండు విద్యాసంవత్సరాల్లో పాఠశాలలు నడవటమే లేదు. విద్యార్థుల నమోదు పూర్తి స్థాయిలో జరగనేలేదు. సంక్షేమ హాస్టళ్ళు తెరవక పోవటంతో అనుబంధ పాఠశాలల్లో అడ్మిషన్లు లేనే లేవు. కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల క్యాడర్ విభజన ఓ కొలిక్కి రానేలేదు. ఇంతటి అస్తవ్యస్త పరిస్థితుల్లో హడావుడిగా ఉపాధ్యాయ పోస్టుల రేషన లైజేషన్హేతు బద్దీకరణ చేయాల్సిన అవసరం విద్యాశాఖకు ఏమొచ్చిందో అంతుచిక్కడం లేదు. అంతర్జిల్లా బదిలీలు, సాధారణ బదిలీలు, పదోన్నతులు పాత జిల్లాల ప్రకారం చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించినా షెడ్యూల్ విడుదల చేయకుండా నాలుగు నెలలపాటు తాత్సారం చేసిన విద్యాశాఖ రేషనలైజేషన్ పట్ల ఇంత శ్రద్ధ చూపడం ఆశ్చర్యంగా ఉంది. లోగడ రేషనలైజేషన్ చేసే సందర్భంలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం జరిపి చర్చించేవారు లేదా వ్రాతపూర్వకంగా అభిప్రాయాలను తీసుకునేవారు. వాటిని పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు ఇచ్చేవారు. ఈసారి అటువంటిదేమీ లేకుండానే ఏక పక్షంగా జిఓను విడుదల చేశారు. ఇచ్చిన జిఓ నెం. 25 లోనూ అస్పష్టత ఉన్నది. 2019 -20 యుడైస్ ఆధారంగా అని కొన్నిచోట్ల 2020 - 21 యుడైస్ ఆధారంగా అని ఒక చోట పేర్కొన్నారు. 2020 - 21 యుడైస్ గణాంకాలు ఇంకా ఫైనల్ కానేలేదు. మరి వాటి ఆధారంగా రేషనలైజేషన్ ఎలా చేస్తొరో అర్థం కాదు. అదనపు పోస్టుల సర్దుబాటు కొత్త జిల్లాల ప్రకారం చేసేటట్లైతే పూర్వపు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఒక జిల్లాలో పోస్టులు అదనంగా తేలి మరొక జిల్లాలో అవసరం పడితే  ఎలా సర్దుబాటు చేస్తారు ఇటువంటి అనేక శేష ప్రశ్నల మధ్య రేషనలైజేషన్ ప్రక్రియను జరపటం అవసరమా అని ప్రశ్ని