క్రీడల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి కనబడేలా చేయాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ** జిల్లా కేంద

Published: Saturday August 20, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు19(ప్రజాపాలన, ప్రతినిధి) : విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ, కోకో, తో పాటు అథ్లెటిక్స్ పోటీలను అదనపు కలెక్టర్ రాజేశం, ఎమ్మెల్యే ఆత్రం సక్కు లతో కలిసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి వారు క్రీడలలో రాణించేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. క్రీడల పట్ల విద్యార్థుల్లో మానసిక  పరిపుష్టి సాధించడంతోపాటు శారీరక పెరుగుదల కూడా ఉంటుందన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా గత 11 రోజుల నుండి అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. మరో మూడు రోజులు ఇదే ఉత్సాహం కొనసాగించేలా చూడాలన్నారు. నేడు శనివారం రంగోలి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అశోక్, జెడ్పిటిసి నాగేశ్వర్ రావు,జిల్లాస్థాయి అధికారులు,తదితరులు పాల్గొన్నారు.