ఎమ్మెల్యే ఆనందును సన్మానించిన వికారాబాద్ మండల నాయకులు

Published: Thursday October 07, 2021
వికారాబాద్ బ్యూరో 06 అక్టోబర్ ప్రజాపాలన : అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో దళిత బంధు విశిష్టత గురించి అద్భుతంగా మాట్లాడిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనందును వికారాబాద్ మండల నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేకు వికారాబాద్ మండల నాయకులు శాలువా కప్పి సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షులు కమాల్  రెడ్డి, వికారాబాద్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ గయాజ్, సీనియర్ నాయకులు రాంరెడ్డి, పార్టీ ఉపాధ్యక్షులు గఫార్, కొటాలగూడెం సర్పంచ్ రాములు, ఎస్టీ సెల్ అధ్యక్షులు మహిపాల్, యూత్ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, యూత్ వైస్ ప్రసిడెంట్ సురేష్, సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.