ఆరోగ్యం బాగాలేని వారికి సరుకులు, బియ్యం పంపిణి

Published: Thursday June 24, 2021
మధిర ప్రజా పాలన ప్రతినిధి 23వ తేదీ మున్సిపాలిటీ ఈరోజు ఉదయం మధిర పట్టణం ఆజాద్ రోడ్ లో ప్రముఖ సామాజిక సేవకుడు లంకా కొండయ్య నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కరోనా క్వారంటైన్ పూర్తి చేసుకొని దీర్ఘ కాలిక అనారోగ్యంతో బాధపడుతున్న మడుపల్లి గ్రామానికి చెందిన యువ కళాకారిణి అరికట్ల శిల్పకు మధిరకు చెందిన ఒక అధ్యత్మిక ఆర్యవైశ్య కుటుంబం నకు చెందిన సహోదరులు ప్రముఖ సామాజిక సేవకుడు ఆరోగ్య పరివేక్షకుడు మధిర ఆశ మిత్ర లంకా కొండయ్య సూచనల మేరకు అనగా ఆ కుటుంబం దయనీయ పరిస్థితి దాతలకు తెలియపరచగా వెంటనే వారు స్పoదించి మానవ సేవే భగవంతుడు సేవగా భావించి ఒక నెలకు సరిపడ బియ్యం సరుకులు కొండయ్యకు అందించగా బుధవారం ఉదయం 8 గంటలకు కొండయ్య మరియు సంఘ సేవకులు తాళ్ళూరి బాలరాజు Anm పంతంగి సంధ్య చేతుల మీదుగా అందించినారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కష్ట కాలంలో బాధపడుతున్న వారికి ఆదరణ కలిపిస్తున్న మధిర ఆర్యవైశ్య కుటుంబం లకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను అని లంకా కొండయ్య బృందం తెలియజేసీనారు. అదే విధంగా నాయెక్క కుటుంబం దీన పరిస్థితి తెలుసు కొని అజ్ఞాత ధాత ద్వారా సహాయం అందించిన కొండయ్య గారికీ ప్రధానముగా బియ్యం సరుకులు ఇచ్చిన దాతలకు ఎంతో రుణ పడి ఉంటానని కళా కారిణి శిల్ప కన్నీటి పర్యాంతమై అభినందనలు తెలిపినది.