నేడే మినీ రైతు బజార్ ప్రారంభం

Published: Thursday July 07, 2022
మధిర జూలై  6 ప్రజాపాలన ప్రతినిధి
 మధిర పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదురుగా రైతులు సొంతంగా ఏర్పాటు చేసుకున్న మినీ రైతు బజార్ ను రేపు ఉదయం ప్రారంభించనునట్లు రైతులు తెలిపారు. పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కాంగ్రెస్ కార్యాలయం ఎదురుగా ఉన్న కాంగ్రెస్ స్థలంలో మినీ రైతు బజార్ ను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరారు