మత విద్వేషాలు రెచ్చ గొట్టొద్దు

Published: Tuesday May 31, 2022
జిల్లా వక్ఫ్ బోర్డు మెంబర్ ఎజాస్ ఆఫ్రిది
వికారాబాద్ బ్యూరో 30 మే ప్రజాపాలన : 
రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14,15, 19, 21, 25, 26, 27 ప్రకారం దేశంలో నివసిస్తున్న మైనార్టీ -ముస్లింలకు చెందిన పవిత్ర మజీద్ లను ధ్వంసం చేస్తామనడం హేయమైన చర్య అని వికారాబాద్ జిల్లా వక్ఫ్ బోర్డు మెంబర్ ఎజాస్ ఆఫ్రిది ఘాటుగా స్పందించారు. మైనారిటీ రిజర్వేషన్లు- ఉర్దూ భాషలను తొలగిస్తామని బహిరంగ ప్రకటన చేసి ముస్లింల మనోభావాలను కించపరిచే విధంగా మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న  కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు-తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగా-జమునా తెఃజిబ్ కు  ఆటంకం కలుగకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని డి.ఎస్.పీ వికారాబాద్ డివిజన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ వికారాబాద్ కు వినతి పత్రం అందజేశామని పేర్కొన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మైనార్టీ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆఫ్ వికారాబాద్ ప్రెసిడెంట్ మరియు జిల్లా వక్ఫ్ బోర్డ్ మెంబర్ ఏజాజ్ ఆఫ్రిది, కో- ఆప్షన్ మెంబర్ ఆఫ్జల్ షకీల్, ఎం. ఐ. ఎం నాయకులు అలీమ్, షరీఫ్, ఎండీ మజార్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.