ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 23 ప్రజాపాలన ప్రతినిధి *తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మక పథకాని

Published: Saturday December 24, 2022
తల్లి బిడ్డల సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం పుట్టడం గర్వంగా ఉందని  బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు కానుగుల మహేష్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి    వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తల్లిబిడ్డ ల  కోసం కేసీఆర్ కిట్టు తల్లి కోసం న్యూట్రిషన్  కిట్ తీసుకురావడం సంతోషకరమని అన్నారు ఇప్పటికే కేసీఆర్  కిట్ అందజేస్తున్న ప్రభుత్వం లక్షలాదిమంది తల్లుల ఆదరణ పొందగా అదే స్ఫూర్తితో తాజాగా పౌష్టికాహార కిట్లకు రూపకల్పన చేశారన్నారు. పౌష్టికాహార లోపాలను తగ్గించడంతో పాటు మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రోటీన్స్ .మినరల్స్. విటమిన్స్.లను పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించడం హిమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రిషన్ కిట్ల లక్ష్యమని అన్నారు ఇందులో భాగంగా ఒక్కో కిట్టుకు  రూ..1962 తో రూపొందించి 50 కోట్లతో గర్భిణీలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ వరంగా మారిందని ఆయన తెలిపారు 9 జిల్లాల్లో ప్రారంభించిన ఈ పథకం అనంతరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీలకు  పంపిణీ చేయనున్నదని అన్నారు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల కోసం  ప్రవేశ పెడుతున్న  కెసిఆర్ గారిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజలలో తమ ఉనికిని  కాపాడుకోవడం కోసం  తెలంగాణ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు ఎవరెన్ని విమర్శలు చేసినా కెసిఆర్ గారు నిరుపేదల పక్షపాతి అని ఆయన కొనియాడారు,