వీధి కుక్కలు కోతుల బెడద నివారించాలి

Published: Wednesday November 30, 2022
 జన్నారం, నవంబర్ 29, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామంలోని వీధి కుక్కలు ఎక్కువగా ఉండడంతో వాటి బెడద నివారించాలని మంగళవారం బిజెపి పార్టీ ఖానాపూర్ అసెంబ్లీ ఐటీ సెల్ కో-కోన్వినార్ బుర్రగడ్డ జగన్ అన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ గ్రామంలో ఏ విధికి వెళ్లిన కుక్కలు గుంపులు గుంపులుగా ఉంటున్నాయని, ప్రజలు వీధుల వెంట వెళ్లాలంటే భయపడుతున్నారు. గ్రామ రహదారి గుండా వానాలపై వెళ్లే వారి వెంట పడుతున్నాయని, ఇప్పటికీ అనేకమంది పిల్లలను పెద్దలను గయపరిచాయని, వీటికి పిచ్చి ఎక్కక ముందే పట్టించి జంతు సంరక్షణ కేంద్రానికి తరలించాలన్నారు. మిగిలిన వాటికి పిల్లలను పుట్టకుండా ఇంజక్షన్ వేయాలన్నారు. అదేవిధంగా మండలంలోని అనేక గ్రామాలలో కోతుల బెడద కూడా విపరీతంగా ఉన్నదని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. గ్రామాలలో వున్న కోతులు ఇండ్లలోకి ప్రవేశించి ఇంటిలో వస్తువులను ధ్వంసం చేస్తున్నాయని అన్నారు. వీటికి కూడా సాధ్యమైనంత త్వరగా పట్టించి అడవిలోకి వదిలివేయాలని ఆయన కోరారు. మండలంలోని ప్రభుత్వ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు స్పందించి వీధి కుక్కల కోతల బెడదను నివారించాలని ఆయన కోరారు.