స్వచ్ఛత టెక్నాలజీ ఛాలెంజ్ లో భాగంగా విద్యార్థుల సందర్శన

Published: Friday December 17, 2021

కోరుట్ల, డిసెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి): స్వచ్ఛ సర్వేక్షన్- 2022 లో భాగమైన స్వచ్ఛత టెక్నాలజీ ఛాలెంజ్ లో భాగంగా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కోరుట్ల పట్టణ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఫీకల్ శ్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను సందర్శించి దానిలో ఎరువుల తయారీ ఏ విధంగా జరుగుతుంది మరియు దానికి సంబంధించిన ఇతర విషయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ డి.గజానంద్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మరియు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నరు