రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

Published: Monday January 17, 2022
మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్
జన్నారం రూరల్, జనవరి 16, ప్రజాపాలన : అకాల వర్షం తో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ ఆదివారం మండలంలోని రేండ్లగూడా గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బెతిన్న పత్తి పంటను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలకు మిర్చి, పత్తి పంటలకు పూర్తిగా దెబ్బతిందని, రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని అయన డిమాండ్ చేశారు. వెంటనే రైతులను ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చేల్లించాలన్నారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మండలంలోని ఇటివల మరణించిన ఇంధన్ పల్లి గొండ్ గూడ గ్రామానికి, చింతగుడ గ్రామానికి చెందిన టుందిత కుటుుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గోలి చందు, జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య, మండల ప్రధాన కార్యదర్శి సురేష్, ఎంపీటీసీ మధుసూదన్ రావు, మాజీ సర్పంచ్ భద్రినాయక్, నాయకులు సురేష్, సూర్యం, అరే సత్యనారాయణ, నరేంధర్, తాటి శ్రీనివాస్, భేడద గోపాల్, రాజమల్లు, నాగన్న, వెయ్యి కండ్ల రవి, నందవేని పవన్ యాదవ్, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.