రాష్ట్ర స్థాయి 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థిని ని అభినందించిన రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర

Published: Friday July 01, 2022

జగిత్యాల, జూన్ 29 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సీరిపూర్ గ్రామానికి చెందిన నూనావత్  మణిమాల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి రెండవ ర్యాంకు లో నిలవడంతో విద్యార్థినికి, విద్యార్థిని తల్లిదండ్రులు టి టి యూ జిల్లా అధ్యక్షులు నూనావత్ రాజు హారికలను రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందనలు తెలియజేశారు.  అఖిల భారత గిరిజన సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యనిర్వాహక అధ్యక్షులు నూనావత్ దేవదాస్ నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన అభినందల కార్యక్రమంలో విద్యార్థినికి మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి, జాయింట్ కలెక్టర్ మాదవి, డీఎస్పీ ప్రకాష్, ఎస్టీ సర్పంచ్ లు ఫోరం జిల్లా అధ్యక్షులు భుక్య గోవింద్ నాయక్, హరి అశోక్ కుమార్, టి.ఎన్.జీ.వో జిల్లా అధ్యక్షులు బోగ శశిధర్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవయ్య లు అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరింత ఏకాగ్రత తో విద్యనభ్యసించి డాక్టరేట్ సాధించి నిరుపేద, బడుగు, బలహీన, సబ్బండవర్ణాలకు, ప్రజలకు  వైద్యసేవలందించి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలషించారు.