పంట మార్పిడితో అధిక దిగుబడులు * జిల్లా రైతుబంధు అధ్యక్షుడు పాతూరు రామ్ రెడ్డి

Published: Saturday November 19, 2022

వికారాబాద్ బ్యూరో 18 నవంబర్ ప్రజా పాలన : పంట మార్పిడితో అధిక దిగుబడులు వస్తాయని జిల్లా రైతుబంధు అధ్యక్షుడు పాతూరు రామ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామ రైతు వేదికను జిల్లా రైతుబంధు అధ్యక్షుడు పాతూరు రామ్ రెడ్డి మొదటిసారిగా సందర్శించి రైతులకు పంటల అధిక దిగుబడి గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు విత్తనాలు విత్తెముందు తమ భూముల భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. భూసార పరీక్షలను అనుసరించి విత్తనాలను విత్తుకొని అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. కాలానుగుణంగా పంటలు వేస్తే అధిక దిగుబడులే కాకుండా రైతు ఆర్థికంగా లబ్ధి పొందుతారని స్పష్టం చేశారు. పంట మార్పిడితో అధిక దిగుబడులతో పాటు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, నిరంతర విద్యుత్ సరఫరా వంటి పథకాలతో రైతుల హృదయాలను చూరగొన్నాడని కొనియాడారు. అంతకుముందు మర్పల్లి మండల రైతుబంధు అధ్యక్షుడు నాయబ్ గౌడ్, మర్పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవరదేశి అశోక్ జిల్లా రైతుబంధు అధ్యక్షుడు పాతూరు రామ్ రెడ్డిని శాలువాతో సత్కరించి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పట్లూరు గ్రామళరైతు అధ్యక్షులు శేఖర్ స్వామి, గ్రామ సర్పంచ్ ఇందిర అశోక్, సర్పంచులు సంగన్న, నూరోద్దీన్, డైరెక్టర్ సంగన్న తెరాస గ్రామ అధ్యక్షులు అశోక్, నాయకులు మోహన్, నర్సిములు‌, రాచన్న, పాల్గొన్నారు.