క్రిస్మస్ కు ముస్తాబైన చర్చీలు* విద్యుత్ దీపాలతో అలంకరించిన చర్చిలు*

Published: Saturday December 24, 2022
క్రైస్తవ సోదరుల గృహాలపై వెలిసిన స్టార్లు*
మధిర రూరల్ డిసెంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ మండల మున్సిపాలిటీ పరిధిలో క్రైస్తవులు ఆరాధనగా పండగ సందర్భంగా క్రిస్టమస్ వేడుకలు నియోజవర్గ మండల మున్సిపాలిటీ పరిధిలో వాడవాడల ఘనంగా నిర్వహిస్తూ చర్చి ప్రార్ధనలు పండగలుక్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగలలో ఒకటైన క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు ఆనందోత్సవాలతో  నిర్వహించేందుకు చర్చిలను ముస్తాబు చేశారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో 1901లో నిర్మించిన అతి పురాతనమైన తెలుగు బాప్టిస్ట్ చర్చిని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా  అలంకరించారు.  చర్చి ముందు పశువుల పాకను ప్రత్యేకంగా తయారు చేసి ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఆర్సీఎం చర్చి, సి.ఎస్.ఐ చర్చి, హెబ్రోన్, పెంతుకోస్తు, క్రీస్తు సంఘం, హోసన్నా , దహించు అగ్ని, దైవ స్వరూపి, కల్వరి టెంపుల్, హోసన్న తదితర చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏసుక్రీస్తు పశువుల పాకలో జన్మించినందున చర్చిల ముందు పశువుల పాకలను సైతం ఏర్పాటు చేశారు. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ప్రత్యేకంగా ఒక నక్షత్రం ఏర్పడటంతో దానికి గుర్తుగా క్రైస్తవ సోదరులు తమ తమ గృహాలపై స్టార్లను ఏర్పాటు చేసుకున్నారు. మధిర డివిజన్లో బ్రిటిష్ కాలం హయాంలో నిర్మించిన మధిర మండలం బయ్యారం ఆర్సీఎం చర్చి ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు ఆర్సీఎం చర్చి చింతకాని మండలం పొద్దుటూరు ఆర్సీఎం చర్చిల్లో ఈనెల 24న జరిగే అర్ధరాత్రి పూజలకు క్రైస్తవ సోదరులు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. ప్రతి సంవత్సరం బయ్యారం చర్చిలో జరిగే ప్రార్థనలకు స్థానిక ఎమ్మెల్యే సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు హాజరవుతారన్నారు. మధిర ఆర్సీఎం చర్చిలో జరిగే ప్రార్ధనలకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ వసంత రాణి దంపతులు హాజరుకానున్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, ఎంపీపీ మెండెం లలిత క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలకు హాజరుకానున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదరులందరూ నూతన వస్త్రాలు కొనుగోలు చేసే ఆనవాయితీ ఉండటంతో పట్టణంలో బట్టల దుకాణాలు క్రైస్తవులతో కిటకిటలాడుతున్నాయి. క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే క్రిస్మస్ గిఫ్టు క్రిస్మస్ విందు ఇప్పటికే అధికారులు మధిర డివిజన్లో పని పూర్తి చేశారు. ఈ సందర్భంగా మధిర ఆర్.సి.యం చర్చి ఫాదర్ శాంత కుమార్ ఆంధ్రప్రభ తో మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా 24వ తేదీ అర్ధరాత్రి జరిగే ప్రత్యేక ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగిందన్నారు.