గురు పౌర్ణమి ఉత్సవాలను పట్నం ప్రజలు జయప్రదం చేయండి

Published: Tuesday July 12, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి సత్యనారాయణ గుట్టపై కొలువైఉన్న  సద్గురు సాయినాథ్ ఎకశిల మందిరము ఖానాపూర్ నందు 12,13,14తెదిలలో గురుపౌర్ణమి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు అభిషేఖాలు, అన్నదాన కార్యక్రమాలు మూడు రోజు లపాటు నిర్వహిస్తున్నా మని, సాయినాథ ఆలయ చైర్మన్ మడుపు వేణుగోపాలరావు తెలిపారు. ప్రతి రోజు స్వామి వారికి పంచామృత అభిషేఖము, నిత్యము ధూప, దీప నైవేద్యాల తో  ప్రతి గురువారం వందాలది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహింపబడుతున్న ఇట్టి క్షేత్రము పిలిచిన వెంటనే పలికి ,కోరిన కోరికలు తీర్చే  దైవంగా ప్రసిద్ది చెందినదని, ఇట్టి క్షేత్రంలో  వేళాది మంది భక్తులు ఎంతొ భక్తి శ్రద్ధలతో గురుపౌర్ణమి ఉత్సవాలు ప్రతిసంవత్సరం జరుపుకుంటారు. కుల మత లకు అతీతంగా రోజు అనేక మంది భక్తజనం స్వామి దర్శణము చేసుకొని పునీతులు అవుతున్న దర్మ‌క్షేత్రము ఈ ఏకశలా సద్గురు సాయినాథుని మందిరము గురుపౌర్ణమి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలలో భక్తజనం అందరికీ సద్గురు సాయినాథుని మందిర నిర్వహకులు సాదర స్వాగతము పలుకుతున్నాము.గురుపౌర్ణమి వేడుకలలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సింది గా కొరుచున్నమని ఆలయ చైర్మన్  మడుపు శ్రీరమ్య  వేణుగోపాల్ రావు తెలిపారు.