వ్యవసాయ కార్మిక సంఘం మండలస్థాయి సమావేశం

Published: Wednesday November 02, 2022

శంకరపట్నం నవంబర్ 01 ప్రజాపాలన ప్రతినిధి:
ఈ రోజు రోజున శంకరపట్నం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో  వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి యుగేందర్ అద్యక్షతన మండల స్థాయీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు హాజరై కేంద్ర ప్రభుత్వం వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతున్న చాప కింద నీరు లాగానే సాగుతున్నది గ్రామీణ ఉపాధి హామీ పథకం నీ నిర్వర్యం చేస్తున్నది అని ఈరోజుల్లోని మార్కెట్  ధరలకు అనుగుణంగా రోజు కూలి 600 రూపాయలు 200 రోజులు పని దినాలు కల్పించాలని పని ప్రదేశాలలో త్రాగు నీరు, టెంటు మెడికల్ కిట్లు సదుపాయాలు కల్పించాలని కార్మికులకు చెల్లించాల్సిన పాత బకాయిలు ఇవ్వాలని లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

అదేవిధంగా మండల నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ కమిటీ లో
మండల అధ్యక్షులుగా తాళ్ల పెళ్లి కుమార్,
ప్రధాన కార్యదర్శిగా మైదంశెట్టి యుగంధర్,
ఉప అధ్యక్షులుగా దేవనూరి కొమురయ్య,సహాయ కార్యదర్శిగా రెడ్డి సంపత్, కోశాధికారి నవీన్ల తిరుపతి మరియు
పదిమంది కమిటీ సభ్యులతో మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమమో లో కార్మికులు రైతులు తధితరులు పాలుగొన్నారు