నేటి జరిగే సడక్ బంద్ ను విజయవంతం చేయాలి.

Published: Tuesday October 05, 2021
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 04, (కాగజ్ నగర్) ప్రజాపాలన : పోడు భూముల కు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అఖిలపక్షం అద్వర్యం లో కాగజ్ నగర్ లో తలపెట్టిన (సడక్ బంద్) రహాదారుల దిగ్బంధం విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం కాగజ్ నగర్ లో స్థానిక విలేకరులతో  అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర బిజేపి, రాష్ర్ట తెరాసా ప్రభుత్వాలు పేసా, అటవీ హక్కులచట్టం సక్రమంగా అమలు చెయ్యని ఫలితంగా ఈ రోజు పోడు సాగు దారులు హక్కు పత్రాలు లేక ప్రభుత్వ పథకాలు రాక ఇబ్బంది పడుతున్నారు. ఈ రాష్ట్రంలో కెసిఆర్ ద్వంద వైఖరి ఫలితంగా పోడు సాగు దారుల ను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిత్యం వేధింపులకు గురిచేస్తుంది అన్నారు. ఈ సమస్యను సివిల్ సమస్య గా మార్చి పోలీస్ వాళ్లు ఇన్వాల్వ్ అవుతూ నిత్యం వందలమంది రైతుల మీద అక్రమ కేసులు పెడుతున్నా రని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పోడు సాగు దారుల పై ఉన్న కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నేడు జరిగే సడక్ బంద్ లో రైతులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం ఉమ్మడి ఆదిలాబాదు పార్లమెంటు నియోజవర్గ అధ్యక్షులు గుల్లపెల్లి ఆనంద్, కాంగ్రెస్ పార్టీ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ కో ఆర్డినేటర్ దాసరి వెంకటేష్, సిపిఎం పట్టణ కార్యదర్శి ముంజం అనంద్ పాల్గొన్నారు