కోతకు గురైన రోడ్డుకు మరమ్మతులు

Published: Thursday September 30, 2021
మధిర, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : మొన్న కురిసిన అకాల వర్షానికి మండల పరిధిలోని మాటూరుపేట గ్రామం నుండి అంబరుపేట పొలాలకు వెళ్లే రోడ్డు తీవ్రంగా కోతకు గురికావడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న రైతులకు ఇబ్బంది లేకుండా జెసిబి ని పిలిపించి మరమ్మతులు నిర్వహిస్తున్న సర్పంచ్ రావూరి శివనాగకుమారి, టిఆర్ఎస్ నాయకులు రావూరి రాము, గ్రామ సెక్రటరీ నరేందర్ రెడ్డి. సకాలంలో స్పందించి రోడ్డు మరమ్మతులు నిర్వహించిన సర్పంచ్ కు గ్రామ రైతులు ధన్యవాదాలు తెలియజేశారు.