ఆడిట్ పేరాలు పెండింగులో ఉంచరాదు

Published: Friday February 11, 2022
జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్
వికారాబాద్ బ్యూరో 10 ఫిబ్రవరి ప్రజాపాలన : పెండింగ్ లో ఉన్న ఆడిట్ పేరాలను సంబంధిత ఆడిట్ అధికారిని సంప్రదించి క్లియర్ చేయించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలియజేసారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నుండి ఎంపీడీఓ లు, ఎంపీవో లు, మున్సిపల్ కమీషనర్లతో పెండింగ్ ఆడిట్ ప్యారాల క్లియరెన్స్ పై గుగూల్ మీట్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ, జిల్లాలో 2015 సంవత్సరం నుండి నేటి వరకు ఎంపీడీఓ, గ్రామ ఓంచాయతీ మరియు మున్సిపల్ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్నటువంటి ఆర్థిక, ఆర్థికేతర ఆడిట్ పేరాలను తగు వివరణలు, వొచర్లు అందజేసి వెంటనే జిల్లా ఆడిట్ ఆఫీసర్ వద్ద క్లియర్ చేయించుకోవాలని సూచించారు. ఇందుకు గాను ఆడిట్ ఆఫీసర్ సహకారం తీసుకోవాలని సూచించారు.  మునుముందు జిల్లాలో ఆడిట్ పేరాలు పెండింగ్ ఉండకుండా ఎక్సపెండిచర్ గైడ్ లైన్స్ ప్రకారం పనులను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డీపీవో మల్లారెడ్డి, జిల్లా ఆడిట్ అధికారి వీరభద్ర రావు, మున్సిపల్ కమీషనర్లు, డివిజనల్ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.