బొగ్గు గని కార్మికులవేజ్ బోర్డు చర్చలు విఫలం సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించిన నాలుగు జాత

Published: Saturday July 02, 2022
బెల్లంపల్లి జూలై 1 ప్రజా పాలన ప్రతినిధి: హైదరాబాదులోని మెరీడియన్ లో శుక్రవారం  జరిగిన బొగ్గు గని కార్మికుల 11వ వేతన కమిటీ చర్చలు విఫలమయ్యాయని వాసిరెడ్డి సీతారామయ్య  తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు., కోల్ ఇండియాలోని డబ్ల్యూ సి ఎల్, సి సి ఎల్, ఎస్ సి సి ఎల్, కంపెనీలు నష్టాలతో ఉన్నాయని, భూగర్భ గనులన్నీ కూడా నష్టాలతో ఉన్నాయని కావున కార్మికుల వేతనాలు ఎక్కువ పెంచలేమని యాజమాన్యం చెప్పినట్లుగా తెలిపారు. పదవ వేజ్ బోర్డు కంటే ఎక్కువగా 27% కంటే ఎక్కువ పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేయగా, వేజ్ బోర్డు చైర్మన్ అగర్వాల్ అంత వేతనాలు పెంచలేమని చెప్పడంతో కార్మిక సంఘాలు నాయకులు చర్చలు బహిష్కరించి బయటకు వచ్చి నోటీసు ఇచ్చి బొగ్గు గనుల శాఖామంత్రిని, కాల్ మినిస్ట్రీ కార్యదర్శిని కలిసిన అనంతరం సమ్మె నోటీసు ఇవ్వాలని మరియు సింగరేణిలో ఆందోళన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించినట్లుగా వారు తెలిపారు.
 
 
 
Attachments area