సంఘంపై నిరాధారణమైన ఆరోపణ చేస్తే సహించేది లేదు

Published: Wednesday November 09, 2022
జన్నారం, నవంబర్ 08, ప్రజాపాలన: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘంపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పాలికోజి నరసింహ చారి స్పష్టం చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల కేంద్రానికి చెందిన శ్రీరాముల గంగాధర్ తో పాటు కొందరు వ్యక్తులు గుర్తింపు కార్డుల కోసం సంఘం డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేయడంలో ఎలాంటి నిజం లేదని, విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ గుర్తింపు కార్డులు ,బీమా, లేబర్ కార్డులు ఇవ్వడానికి సొంత ఖర్చులతో జిల్లా నాయకత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘంపై ఆయన చేసిన ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని, అంతేకాకుండా ఐక్య సంఘం నుండి ఆయనను రెండు సంవత్సరాల క్రితమే తొలగించడం జరిగిందని, ఐక్య సంఘం కు గంగాధర్ కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాష్ట్రంలో 69 జీవోను రద్దు చేసి 55 జీవోను అమల్లో ఉంచాలని, రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లకు,  ఎమ్మార్వోలకు, ఆర్డీవోలకు, ఎమ్మెల్యే లకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నర్సింగోజు బాపు చారి, జిల్లా ఉపాధ్యక్షుడు కడార్ల నర్సయ్య చారి, రేవెళ్ల తిరుపతి, దోనోజు శ్రీనివాస్, బావాండ్లపెళ్లి శ్రీనివాస్, కొత్త జయాకర్, తదితరులు పాల్గొన్నారు.
 
సంఘంతో నాకు ఎలాంటి సంబంధం లేదు
 
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘంతో నాకు ఎలాంటి సంబంధం లేదని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ కూడా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం పేరు  చేప్పలేదని, ఆ సంఘం పైన ఎలాంటి ఆరోపణలు చేయలేదని అన్నారు. నాపైనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, వారికి త్వరలోనే సమాధానం చెబుతానని అన్నారు.