ప్రతి మనిషి ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి * వికారాబాద్ ఆధ్యాత్మి సేవా మండలి సభ్యులు

Published: Monday December 26, 2022

వికారాబాద్ బ్యూరో 25 డిసెంబర్ ప్రజా పాలన : సమాజ శ్రేయస్సుకు నిర్వహించే దైవకార్యాన్ని ప్రజలందరూ అనుసరించాలని వికారాబాద్ ఆధ్యాత్మిక సేవ మండల సభ్యులు కోరారు. కుల మతాలకు నిర్వహించే సామాజిక చైతన్య కార్యక్రమంలో భాగంగా అతిరుద్ర మహాయజ్ఞ సప్తాహం ఇతోదికంగా తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి మైదానంలో అతిరుద్ర మహా యజ్ఞసప్తాహం ఐదవ రోజు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నది. కాకినాడ పీఠాధిపతి పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి ప్రసంగం అద్వితీయం అనిర్వచనీయం. మనిషి పుట్టుకకు ప్రపంచ నడవడికకు గల సారూప్యత గురించి ఉదాహరణలతో సైతం వివరించడం విశేషం. ఎప్పుడో ఒకప్పుడు నిర్వహించే అతి రుద్ర మహాయజ్ఞ సప్తాహం సామాన్య విషయం కాదని కొనియాడారు. యజ్ఞ యాగాదులలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని అనుభూతి చెందడంతో మానవ జన్మ పరిపక్వత చెందుతుందని స్పష్టం చేశారు. నేడు మనిషి యాంత్రిక గమనంలో నడుస్తున్న ఒక యంత్రంలా పనిచేస్తున్నాడు. తన కుటుంబ సభ్యుల గురించి, తన పరిసరాల సామాజిక పరిస్థితులను గమనించే పరిస్థితుల్లో మనుషులు లేరు. ప్రతి యజ్ఞం ఒక విశిష్టతను సంతరించుకుంటుంది. అతిరుద్ర మహా యజ్ఞ సప్తాహం కార్యక్రమాన్ని చూసి తరించడానికి భక్త సందోహం సముద్రం లా కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక సేవా మండలి సభ్యులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్  చిగుళ్లపల్లి రమేష్ కుమార్ తాండూరి రాజు మ్యాడం వెంకటేష్ కోట కృష్ణ గిరిధర్ రెడ్డి యాస్కి సునీల్ వేద పండితులు ఆధ్యాత్మిక సేవా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.