మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Monday August 22, 2022
మంచిర్యాల బ్యూరో, ఆగస్టు 21. ప్రజాపాలన  :
 
భావి తరాలకు సహజ వాయువుతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం కోసం  మొక్కల సంరక్షణలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. స్వతంత్ర భారత వజోత్సవ మహోత్సవంలో భాగంగా ఆదివారం నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో  జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం గ్రామపంచాయతీ పరిధిలోని పౌనూరు కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 

ప్రజలు స్వచ్ఛందంగా  మొక్కలు నాటి, వాటిని సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, తహశీల్దార్ మోహన్రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి సత్యనారాయణ, అటవీ డివిజనల్ అధికారి వినయకుమార్ సాహు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ, అటవీ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.