పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ గౌతమ్ వినతిపత్రం అందచేసిన మండల కాంగ్రెస్ కమిటీ

Published: Friday August 13, 2021
ఏరుపాలెం, ఆగస్టు 12, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండల పర్యటనలో భాగంగా బనిగండ్లపాడు PHC ని సందర్శించిన  సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ గార్ని కలిసి మండలంలోని పలు సమస్యలపై రిప్రజెంటేషన్ అందచేసిన మండల కాంగ్రెస్ కమిటీ ముఖ్యంగా ఎర్రుపాలెం మండల కేంద్రం సమీపంలో వెళ్తున్నగ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు కు కనెక్షన్ పాయింట్ EXIT POINT ఇప్పించాలని కోరగా వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడతానని బదులిచ్చారు, ఇంకా మండల కేంద్రం నుండి గుంటుపల్లి గోపవరం R&B రోడ్ మిగిలిన పని పూర్తి చేయాలని, నూతనంగా ఏర్పడ్డ గ్రామపంచాయితీలకు బిల్డింగ్స్ మంజూరు చేయించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండారు నరసింహారావు, దేవరకొండ శ్రీను, వేమిరెడ్డి రామిరెడ్డి తదితరులు ఉన్నారు.