శివారెడ్డిపేట్ పిఎసిఎస్ లో శనగ విత్తనాలు లభ్యం

Published: Wednesday September 14, 2022
 పిఎసిఎస్ చైర్మన్ మసనగారి ముత్యంరెడ్డి
వికారాబాద్ బ్యూరో 13 సెప్టెంబర్ ప్రజాపాలన : నాణ్యమైన శనగ విత్తనాలు శివారెడ్డి పెట్ పిఎసిఎస్ లో అందుబాటులో ఉన్నాయని పిఎసిఎస్ చైర్మన్ మసనగారి ముత్యంరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పిఎసిఎస్ కేంద్రంలో పిఎసిఎస్ చైర్మన్ మసనగారి ముత్యంరెడ్డి విలేకరులతో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నకిలీ విత్తనాలతో మోసపోకుండా పిఎసిఎస్ కేంద్రంలో లభించే నాణ్యమైన శనగ విత్తనాలను తీసుకెళ్లాలని సూచించారు ప్రస్తుతం పిఎసిఎస్ కేంద్రంలో 500 బ్యాగుల సెనగ విత్తనాలు ఉన్నాయని తెలిపారు ఒక్కొక్క బ్యాగులో 25 కిలోలు ఉంటాయని చెప్పారు ఒక బ్యాగు ఖరీదు 1747 రూపాయలని స్పష్టం చేశారు. రైతులకు ఇప్పటివరకు దీర్ఘకాలిక రుణాలు ఐదు కోట్లు అందించామని వివరించారు స్వల్పకాలిక రుణాలను రెండు కోట్ల వరకు ఇచ్చామని అన్నారు రైతుల అవసరాన్ని బట్టి దీర్ఘకాలిక రుణాలను ఇంకా అందజేస్తామని గుర్తు చేశారు ఈ ఏడాది రైతులకు దీర్ఘకాలిక రుణాలకును అందించేందుకు ఐదు కోట్ల రూపాయల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు రైతులు నాణ్యమైన శనగ విత్తనాలతో విత్తుకొని అధిక లాభాలు ఆర్జించాలని కోరారు.
 
 
 
Attachments area