దేశ రాజకీయాల్లోకి బి ఆర్ ఎస్ ను స్వాగతిస్తున్నాం : ప్రజా సంఘాల జె ఏ సి చైర్మన్ గజ్జెల కాంతం హై

Published: Friday October 07, 2022
తెలంగాణ రాష్ట్రం లో దళిత, గిరిజన,బీసీ, మైనార్టీ ల సంక్షేమానికి కృషి చేస్తున్న కె సి ఆర్ దేశ వ్యాప్తంగా ఉన్న అందరికీ న్యాయం చేయగలరన్న సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజా సంఘాల జె ఏ సి చైర్మన్ గజ్జెల కాంతం. లక్డికాపూల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ 
భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన భాధ్యత ప్రజలకు ఉందని, రాజ్యాంగం ను  బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, రాజ్యాంగంలో ఉన్నటు వంటి ఏ ఒక్క దానిని అమలు చేయడం లేదన్నారు. మత కల్లోలాలు సృష్టించడమే బీజేపీ చేస్తున్న పని అని హిందువుల పేరుపై ఓట్లు కొల్లగొట్టడం తప్ప హిందువులకు బీజేపీతో ఒరిగిందేమిలేదన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వక రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఎస్ సి ఎస్ టి లకు బీజేపీ వల్ల ఏమి జరగలేదని, రిజర్వేషన్ లు నిర్వీర్యం చేశారని, బీసీల జనగణన లెక్కలు నేటికి చేపట్టకపోవడం ఇందుకొక ఉదాహరణ అన్నారు. నిత్యావసర వస్తువుల పెంపు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, తప్ప బీజేపీ చేసిందేమి లేదన్నారు. నూతన పార్లమెంట్ కు బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికోరకు మరో పోరాటానికి సిద్ధమవుతున్నామని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాలలోని దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఛలో ఢిల్లీ కార్యక్రమంను నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. నవంబర్ 15,16 వ తేదీలలో జంతర్ మంతర్ వద్ద ఒక రోజు ధర్నా, ఒక రోజు దీక్ష చేయనున్నట్లు తెలిపారు.
కేసి ఆర్ ప్రకటించిన జాతీయ పార్టీని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. బి ఆర్ ఎస్ కు అన్ని రాష్ట్రాలలోని తమ దళిత గిరిజనులు సంపూర్ణ మద్దత్తు ప్రకటిస్తున్నామన్నారు. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ నుండి రాజ్యాంగం ను కాపాడుకోవాల్సిన భాధ్యత మనదే అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శలు చేసే ముందు వారు చేసిందేంటో చెప్పాలన్నారు.ఒకప్పుడు రెండు సీట్లతో ఉన్న బీజేపీ హిందువుల పేరు చెప్పుకొని మత కల్లోలాలు సృష్టించి నేడు అధికారం లోకి రాలేదా అని ప్రశ్నించారు. గుజరాత్ సి ఎం మోడీ పి ఎం అవ్వగా తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్ పి ఎం కాలేరా అన్నారు. బీజేపీ చాలా మందిని ప్రపంచ కుబేరులను చేయలేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగం ను కాపాడుకోవాల్సిన బాధ్యత కె సి ఆర్ తీసుకోవాలన్నారు. మునుగోడు ప్రజల గురించి పట్టించుకోని రాజగోపాల్ రెడ్డి ని, బీజేపీ ని ఎన్నికలలో దళిత, బీసీ మైనార్టీ లు చిత్తుగా ఓడిస్తారన్నారు.తెలంగాణ లో అమలు లో ఉన్న పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని అందుకు కె సి ఆర్ కృషి చేస్తారన్న నమ్మకం తమకుంది అని అన్నారు.దళిత, బీసీ మైనార్టీ లకు న్యాయం జరగాలంటే బి ఆర్ ఎస్ అధికారం లోకి రావాలని కె సి ఆర్ ప్రధాన మంత్రి కావాలన్నారు.ఈ సమావేశం లో కొమ్ము తిరుపతి, సముద్రాల ప్రశాంత్, సురేందర్ సన్నీ, డాక్టర్ సంజీవ్, బుల్లెట్ సుజిత్ తదితరులు పాల్గొన్నారు.