దళితులు సీఎం కేసీఆర్ జీవితాంతం రుణపడి ఉండాలి

Published: Wednesday October 13, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెరాస రాష్ట్ర యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకట రమణా రెడ్డి, ఎంపీపీ పి.కృపేష్ సూచన మేరకు ఇబ్రహీంపట్నం మండల ఎస్సీసెల్ అధ్యక్షుడిగా చర్ల పటేల్ గూడ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి పంది మైసయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎలిమినేడు గ్రామానికి చెందిన మంద మోహన్ తో పాటు 19 మంది సభ్యులతో కలిసి ఎస్సీ సెల్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చిలకల బుగ్గ రాములు, ప్రధాన కార్యదర్శిగా గంగిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో దళితులకు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో నియోజకవర్గంలో దళితులకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తొందరలో  రాష్ట్రవ్యాప్తంగా, నియోజకవర్గంలో దళితులకు ప్రతి ఒక్కరికి దళిత బంధు వచ్చే విధంగా కెసిఆర్  ప్రభుత్వం చేపడుతుందని వారు తెలిపారు. ఎస్సీ సెల్ కమిటీ ఎన్నికైన వారికి వారు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్రామాలలో తెరాస ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుదు డేరంగుల నరసింహ, కాలే గణేష్, ఎంపిటిసిల ఫోరంఅధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, చర్ల పటేల్ గూడెం సర్పంచ్ గీత రామ్ రెడ్డి, మండల నాయకులు చెరుకు రవీందర్, నరేందర్ రెడ్డి, కత్తుల కుమార్, భగీరథ సాగర్, హనుమాడా ఆంజనేయులు, సురేందర్, పంది సురేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు. ఎన్నికైన వారికి శాలువాలతో సన్మానించారు నియామక పత్రాలు అందించడం జరిగింది.