ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించి ప్రభుత్వమే ఫీజులను నిర్దారించాలి - ఎస్ఎఫ్ఐ

Published: Monday June 21, 2021
జగిత్యాల, జూన్ 20 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జులై 01 నుండి విద్య సంస్థలు ప్రారంభం కావడంతో అర్హులైన విద్యార్ధులకు తక్షణమే ఉచితంగా వ్యాక్సీన్ అందించి ప్రయివేట్ విద్య సంస్థల్లో ప్రభుత్వమే ఫీజులను నియంత్రించి ప్రభుత్వమే ఫీజుల ధరలను నిర్ణయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్రమాలిక్ సూచించారు. విద్యాసంస్థలు ప్రారంభిస్తే మళ్ళీ పేద విద్యార్ధులు చదువులు సాగేందుకు అవకాశం ఉంటుందని విద్యాసంస్థలో ప్రభుత్వమే ఉచితంగా అర్హులైన విద్యార్థులకు వ్యాక్సీనేషన్ ప్రారంభించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటీకీ పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు చాలామంది ఉపాధ్యాయులు పదవీ విరమణ పోందారు. టీచర్ పోస్టులు భారీగా ఖాళీలు అయ్యాయని అ స్థానంలో కనీసం కోన్ని నెలల వరకు విద్యా వాలంటీర్స్ నియమించుకోవాలని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలో చదువుతున్న వారందరికీ ఉచితంగా మాస్కులు శానిటైజర్స్ అందించాలని కరోనా నిబంధనలు పాటించేల చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాసంస్థలలో టాయిలెట్స్ సౌకర్యం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనానికి పోషకాహారం వారానికి 4 సార్లు గ్రుడ్డు రెండు సార్లు పండ్లు ప్రభుత్వ విద్యా సంస్థలలో ఆరోగ్య కార్యకర్తను నియమించాలని అక్రమాలిక్ టి. వివేక్ తెలియజేశారు.