దేశంలో మత విద్వేషాలు ను రెచ్చగొడుతున్న బిజెపి, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్ నాయకుల పై చర్యలు తీసుక

Published: Monday February 14, 2022
పాలేరు పిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి : ఈ సందర్భంగా. తెల్లపాడు గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం పిడిఎస్యు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పాల్గొని, మాట్లాడుతూ... దేశంలో రోజురోజుకు మత విద్వేషాలు రెచ్చగొడుతూ దళితులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని మరీ ముఖ్యంగా సంఘ పరివార్ శక్తులు అడ్డు అదుపు లేకుండా మైనారిటీలు దళితులపై దాడులు చేస్తున్న పరిస్థితి ఈరోజు దేశంలో కనిపిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినిలపై కాషాయ ముసుగులో మత పూరిత దాడులు పూనుకోవడం హేయమైన చర్య అని వారు అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను స్వేచ్ఛను హరించడమే నేడు బీజేపీ  ప్రభుత్వం యొక్క సిద్ధాంతం అన్నారు. భారతదేశం రాజ్యం కాదని లౌకిక ప్రజాస్వామ్య రాజ్యమని అనేక మతాలు కులాలు అనే వైవిధ్యం ఉన్న ప్రజలు భిన్నత్వంలో ఏకత్వం యొక్క విధివిధానాలు అన్నారు. గతంలో ముస్లిం రాజులు దేశాన్ని పాలించిన ఇప్పటికీ లౌకికవాదాన్ని పాటించాలని తెలిపారు కానీ బిజెపి ఆర్ఎస్ఎస్ అప్పుడు సిద్ధాంతంతో హిందూ రాజ్యంగా మార్చాలని రాజ్యాంగం ఇచ్చిన హక్కులను లేకుండా చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉడిపి లో మైనార్టీ మహిళల పై, జరుగుతున్న దాడులను ఆఫ్ చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కైలా వెనుకాడబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు పాలేరు డివిజన్ ప్రధాన కార్యదర్శి జి మస్తాన్ నవీన్ గోపి పావని యమున వెంకటేష్ చందు గణేష్ త్రి నేష్ అన్వేష్ రాకేష్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలాయపాలెం మండల కేంద్రం. పిడిఎస్యు తెట్టెలపాడు గ్రామ కమిటీ.