వీఆర్ఏ లకు అన్నివేళలా అండగా ఉంటాం -* *రాష్ట్ర కార్యదర్శి కందికంటి విజయ్ కుమార్

Published: Saturday July 23, 2022

 

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 22 ప్రజాపాలన ప్రతినిధి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ గతంలో అసెంబ్లీ సాక్షిగా ఏవైతే అసెంబ్లీలో హామీ ఇచ్చిండో వాటిని నెరవేర్చాలి అని వీఆర్ఏ లు తమ న్యాయమైన డిమాండ్లు, చేస్తున్న రీలే నిరాహారదీక్షకు సంఘీభావంగా ఈ రోజు ఆర్డీవో కార్యాలయం తుర్కయంజాల్ ఎదుట తలపెట్టిన దీక్షలో సంఘీావం తెలియజేస్తూ, బహుజన సమాజ్ పార్టీ వీఆర్ఏ లకు అన్ని విధాలుగా అండగా ఉంటది అని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కందికంటి విజయ కుమార్ , రంగా రెడ్డి జిల్లా ఇంచార్జి జగన్ జి జిల్లా కార్యదర్శి & అసెంబ్లీ ఇంచార్జి పల్లటి రాములు , అసెంబ్లీ అధ్యక్షులు మల్లేష్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బోళ్ల గణేష్ ముదిరాజ్ , అబ్దుల్లాపూర్ మెట్ మండల కన్వీనర్ బంగారి మైసయ్య , పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ అద్యక్షులు యంజాల ప్రహ్లాద్ తుర్కయంజాల మున్సిపాలిటీ అద్యక్షులు వద్ధిగల్ల బాబు , కార్యదర్శి జంతుక సైదులు, కోశాధికారి పట్నం రమేష్ కురుమ , సత్యం, రాజు , లక్ష్మీపతి , గౌరేల్లి సెక్టార్ అధ్యక్షులు చిత్రం కృష్ణ మొండి గౌరేళ్ళీ సెక్టార్ అధ్యక్షులు *కట్టెల ప్రవీణ్ గారు* తదితరులు పాల్గొన్నారు.