పల్లా కు కాపులు మద్దతు..

Published: Saturday March 13, 2021
ఖమ్మం, మర్చి 12, ప్రజాపాలన ప్రతినిధి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం కోసం కృషిచేస్తామని కాపు సంఘం నాయకులూ కొందరు తెలిపారు. పల్లా  గెలిపించాలని కోరుతూ మున్నూరు కాపులతో శుక్రవారం ఖమ్మం లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతు పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటుతో వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్దించారు. సమావేశంలో మున్నూరు కాపు సంఘం నాయకులూ అర్ జె సి  కృష్ణ, పారా నాగేశ్వరరావు, బి. విజయ్ కుమార్. మేకల బిక్షమయ్య గీత వెంకన్న. మెంతుల శ్రీశైలం. పొన్నం వెంకటేశ్వర్లు, తోట రామారావు, తోట ఉమారణి, పిన్ని కోటేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.