ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

Published: Wednesday April 12, 2023
జన్నారం, ఏప్రిల్ 11, ప్రజాపాలన: మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతిని, బీసీ కులాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉద్యమ పోరాట సంఘం కన్వీనర్ కోడూరు చంద్రయ్య, అంబేద్కర్ సంఘం, ఎస్సీ ఎస్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం మండలంలోని పొనకల్ గ్రామపంచాయతీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషి మహోన్నతుడిగా, తీర్చి దిద్దేది విద్య ఒకటేనని, అందరికీ విద్యనందేలా 200 ఏళ్ల క్రితమే కార్యచరణ చేపట్టిన ఘనుడని పూలేను కొనియాడారు. పూలే  ఆ రోజుల్లో విద్య లేనందున, జ్ఞామం లేకుండ పోయిందని, నైతికత లేకుండ పోయిందని, ఐక్యమత్యం లేనందున, శక్తి లేకుండ పోయిందని, శక్తి లేనందున  అణచివేయబడ్డారని, అన్ని అనార్దాలు కేవలం విద్య లేకపోవడం వలన జరిగాయని మహాత్మ జ్యోతిరావు పూలే  అన్నారన్నారు. దేశంలో విద్యను అందించాలని మొట్టమొదటిసారి మహిళలకు పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అనే సామాజిక భావన పెంపొందించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. వంచిత్ బహుజన్ ఆఘాడి విభిఏ జాతీయ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ మండలంలోని దేవుని గూడా గ్రామపంచాయతీ పరిధి చర్లపల్లిలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పేదలకు బట్టలు పంపిణీ చేశారు. విబిఎ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఆధునిక యుగంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన సామాజిక విప్లవ యోధుడని పూలేను కొనియాడారు. ఈ పూలే జయంతి సందర్భంగా బట్టల పంపిణీ కార్యక్రమంలో నాయకులు గ్రామ యువత దండేవేణి మొగిలి, మహ్మద్ బాబూమియా, ఇతరులు ఉన్నారు. అదేవిధంగా మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు తిమ్మాపూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ జాడి గంగాధర్ పూలే జయంతి పునస్కరించుకొని, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్పంచ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాల కోసం నేటి యువత పోరాడాలన్నారు. బడుగు బలహీన వర్గాల, ఆశాజ్యోతి, సామాజిక సంస్కకరణల నాంది కర్త, బడుగు జనోద్దారకుడు, మానవతావాది, ఈ సందర్భంగా పూలే సామాజిక దేశ సేవలను స్మరించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు ఆడెపు లక్ష్మీనారాయణ, మూల భాస్కర్ గౌడ్, కాడెర్ల నరసయ్య, సులువ జనార్దన్, ముత్యం సతీష్, కొండపల్లి మహేష్, రాజన్న, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు చిట్టిమల్ల భరత్ కుమార్, నాయకులు బోర్లకుంట ప్రభుదాస్, మామిడిపల్లి ఇందయ్య, ఎస్సీ ఎస్టీ నాయకులు తాళ్లపెళ్లి రాజేశ్వర్, ముడుగు ప్రవీణ్ కుమార్, దుమల్ల రమేష్, దుమల్ల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.