అర్హులైన ప్రతి గిరిజనుడికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలి ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవ

Published: Tuesday December 13, 2022
 అర్హులైన ప్రతి గిరిజనులకు మరియు వారి కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ అన్నారు.   సోమవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్ లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అధికారిక పనులపై వెళ్లినందున గిరిజన దర్బార్ లో అర్జీలు సమర్పించడానికి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన గిరిజన లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా విడుదల అయ్యే సంక్షేమ పథకాలు త్వరితగతిన అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఎక్కువ శాతం దరఖాస్తులు పోడు భూముల సమస్యలు ,వ్యక్తిగత సమస్యలు ,గురుకుల పాఠశాలలోని సీట్ల మార్పిడి కొరకు, సబ్సిడీ ద్వారా అందుతున్న ట్రైకర్ రుణాల కొరకు, వ్యవసాయానికి సంబంధించిన కరెంటు మోటార్లు, బోరు బావుల గురించి ,స్వయం ఉపాధి పథకం ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థికపరమైన రుణాల కొరకు, చేపల చెరువులకు సంబంధించిన సొసైటీల ఏర్పాటు కొరకు ,మరియు కిరణా షాపులు, జనరల్ స్టోర్లు, గేదెలు కొనుగోలు చేయడానికి దానికి సంబంధించిన రుణాల కొరకు ,అలాగే పై చదువు లు చదవడానికి ఆర్థిక సహాయం కొరకు, దీర్ఘకాలిక రోగాలకు సంబంధించి వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం కొరకు ,పంట భూములలో కరెంటు మోటార్ కి సంబంధించిన కరెంట్ మీటర్ల కొరకు ,మారుమూల గ్రామాలలోని గిరిజనులు ఇండ్ల స్థలాల కొరకు భూమి ఇప్పించుట కొరకు ,సంబంధిత అర్జీదారులు దరఖాస్తులు సమర్పించారని, వాటిని ప్రత్యేకమైన రిజిస్టర్లు లో నమోదు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి విడతలవారీగా వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఉద్యోగాల కొరకు ఎవరు గిరిజన దర్బార్ లో దరఖాస్తులు సమర్పించకూడదని ,ప్రభుత్వం ద్వారా ఉద్యోగ ప్రకటన వెలువడిన వెంటనే సంబంధిత శాఖల ద్వారా అర్హులైన నిరుద్యోగులకు వారి యొక్క అర్హతను బట్టి ఉద్యోగాలను భర్తీ చేస్తారని కానీ గిరిజన దర్బార్ లో మాత్రం ఎవరు ఉద్యోగాల కొరకు దరఖాస్తు లను సమర్పించకూడదని ఆయన అన్నారు.    ఈ కార్యక్రమంలో ఎస్ఓ సురేష్ బాబు, ఏడి అగ్రికల్చర్ భాస్కరన్ ,ఐటిడిఏ మేనేజర్ ఆదినారాయణ, డీఎస్ఓ ప్రభాకర్ రావు, గురుకులం ఏవో నరేందర్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ ఏవో ప్రమీల భాయ్, వైద్యం ,ఇంజనీరింగ్ ,ఎస్ డి సి, విద్యుత్ విభాగాల నుండి దుర్గయ్య, వెంకటేశ్వర్లు, నాగభూషణం ,చలపతి, ఇతర శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.