కుందా సావిత్రి హోమియో హాస్పిటల్ నందు ఘనంగా ప్రపంచ హోమియో దినోత్సవ వేడుకలు

Published: Monday April 11, 2022
మధిర ఏప్రిల్ 10 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో ఆదివారం నాడు ఆత్కూరు బైపాస్ రోడ్ లోని కుందా సావిత్రి సేవాసమితి హోమియో హాస్పిటల్ నందు ప్రపంచ హోమియో దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హోమియో హాస్పిటల్ నిర్వాహకులు శ్రీ సంక్రాంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచానికి అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి సేవలందించగలిగే హోమియో వైద్యాన్ని అందించినటువంటి హోమియో వైద్య శాస్త్ర పితామహుడు శ్రీ శామ్యూల్ హనీమన్ జన్మదినం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదో తారీఖున ప్రపంచ హోమియో దినాన్ని జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామభక్త సీతయ్య కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి బాబ్ల, రమ్య సిల్క్స్ అధినేత శ్రీ నాళ్ళ నారాయణరావు, హోమియో హాస్పటల్ వాలంటీర్స్ బొగ్గవరపు హరీష్, చేడే శ్రీనివాస్, చేడే సతీష్, మేడేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.