మోటార్ల స్టార్టర్లను తొలగించడం ప్రభుత్వ వైఫల్యమే సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వ

Published: Monday February 20, 2023

 

బోనకల్, ఫిబ్రవరి 17 ప్రజా పాలన ప్రతినిధి:

రైతులు వ్యవసాయ మోటార్లకు అమర్చిన ఆటోమేటిక్ స్టార్టర్లను ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్‌ సిబ్బంది స్టార్టర్లను తొలగించడం ప్రభుత్వ వైఫల్యమేనని సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతులు శుక్రవారం,శనివారాల్లో గ్రామ శివారులోని వ్యవసాయ బావులు,బోర్ల వద్దకు వెళ్లేసరికి విద్యుత్‌ సిబ్బంది కొన్ని స్టార్టర్లను కట్‌ చేసి తీసుకువెళ్లారనీ,మళ్ళీ శనివారం స్టార్టర్లు కట్‌ చేసి తీసుకువెల్తున్న సమయంలో గ్రామ రైతులు అధికారులను అడ్డుకున్నారు. మోటార్లకు అమర్చిన స్టార్టర్ ను తొలగించడం రైతులకు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉన్నదని సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు అన్నారు. ఓవైపు అప్రకటిత విద్యుత్ కోతలతో సతమాతమవుతున్న తమపై ప్రభుత్వం కక్ష కట్టినట్లు మళ్లీ తమ మోటార్లకు అమర్చిన ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించడం ఏంటని వారు పెద్ద ఎత్తున అధికారులను నిలదీశారు.24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తామని గొప్పలు చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిన దాఖలాలు ఇంతవరకు లేదని వారు మండిపడ్డారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించలేకనే ఈ విధమైన చర్యలకు పాల్పడుతుందని వారు అన్నారు. కనీసం రోజుకి 10 గంటలకు కూడా విద్యుత్ రావడం లేదని వాపోయారు. రైతులని ఇబ్బంది పెట్టవద్దని విద్యుత్‌ సిబ్బందికి విన్న వించినా వినకపోవడంతో విద్యుత్ అధికారులను తీసుకెళ్లి తమ గ్రామపంచాయతీలో నిర్బంధించినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో రైతు కనీసం 10 నుంచి 30 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని, మోటర్లు ద్వారా నీళ్లు పెట్టాలంటే ఏ సమయానికి కరెంటు ఇచ్చేది తెలియని పరిస్థితుల్లో మోటార్లకు ఆటోమేటిక్ స్టాటర్లు అమర్చుకొని నీళ్లు సరిపడగానే వాటిని ఆఫ్ చేసుకుంటున్నట్లు తెలిపారు.శుక్రవారం 15 స్టార్టర్లను,శనివారం మరో 30 స్టార్టర్లను విద్యుత్ సిబ్బంది తొలగించారని రైతు సంఘం నాయకులు పారుపల్లి నరసింహారావు తెలియజేశారు.అధికారులు ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించడం ఆపకపోతే, విద్యుత్ స్తంభాలతో పాటు ట్రాన్స్ఫార్మర్లు కూడా పూర్తిగా తీసివేయాలని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. విద్యుత్ మోటార్లకు అమర్చుకున్న స్టార్టర్ ను తొలగించే ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని అధికారులకు తెలియజేశారు.బోనకల్, ఫిబ్రవరి 17 ప్రజా పాలన ప్రతినిధి: