స్టేషన్ రావినూతల ప్రజలకు త్రాగునీటి కష్టాలు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన పట్టించ

Published: Thursday March 09, 2023
బోనకల్, మార్చి 08 ప్రజా పాలన ప్రతినిధి:
మండలంలోని పలుచోట్ల వేసవికి ముందే తాగునీటి ఎద్దటి నెలకొంది. గ్రామాల వైపు మిషన్ భగీరథ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో నీటి కష్టాలు రెట్టింపవుతున్నాయి.మండలంలోని స్టేషన్ రావినూతల2 మారుమూల ఉంది. గత వారం రోజులుగా తాగునీటి సౌకర్యం లేక ఆ స్టేషన్ రావినూతల తీవ్ర అవస్థలు పడుతున్నారు.తాగునీటి సమస్య వేసవి కాలంలో మొదట్లోనే ఇంత తీవ్రంగా ఉంటే ఎండల తీవ్రతకు రానున్న రోజులలో ఎలా ఉండనుందొనని ప్రజలలో ఆందోళన నెలకొంది. పైప్ లైన్లు పగిలిపోయాయంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప వాటికి మరమ్మత్తులు చేసి నీటి పంపిణీ చేసిన దాఖలాలు మిషన్ భగీరథ అధికారులు ఎక్కడ కూడా చేపట్టడం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. కనీసం మిషన్ భగీరథ ఏఈ ఫోన్ చేస్తే చేస్తాంలే అంటూ చేతులు దులుపకుంటు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు..అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా వారెవ్వరూ పట్టించుకోలేదని చెబుతున్నారు.మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి స్టేషన్ రావినూతల ప్రజల త్రాగునీటి కష్టాలు తీర్చాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.