పటాన్చెరులో పట్టణ ప్రగతిని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Published: Friday July 02, 2021
పట్టణ ప్రాంతాల సమగ్ర వికాసమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టణ ప్రగతి, హరిత హరం, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. పది రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఈ సంవత్సరం దళితుల సాధికారికత కోసం రెండు రోజులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, ప్రమోద్ గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.