ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి

Published: Wednesday April 20, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 19 ఏప్రిల్ ప్రజాపాలన : ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బంట్వారం పర్యటనకు వెళ్తుండగా మార్గమధ్యలో క్యాచారం పంటపొలాల్లో (ఉపాధి హామీ పథకం) పనిజరిగే ప్రదేశానికి వెళ్లి, వారిని పలకరించారు. ఉపాధి హామీ పనిచేస్తున్న వారు మాట్లాడుతూ... పని సమయం ఉదయం పూట మాత్రమే ఉండాలని, రెండు పూటలా విధానం వద్దు అని ఎమ్మెల్యేను కోరుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పూట పనినే కొనసాగించాలని చెప్పిన, కేంద్ర ప్రభుత్వం రెండు పూటల పనివిధానం తీసుకొస్తుందని, మీయొక్క డిమాండ్ ను పై స్థాయికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు.