నీతి అయెాగ్ బహీష్కరించడం కేసీఆర్ తెలంగాణా చెడు చేయడమే

Published: Monday August 08, 2022
జన్నారం, ఆగస్టు 07, ప్రజపాలన:
 
 నీతి అయోగ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి బహిష్కరించడం తెలంగాణకు చెడు చేయడమేనాని మంచిర్యాల జిల్లా బిజేపి ఎస్టి మెార్చా జిల్లా అద్యక్షుడు అజ్మీర్ బద్రీ నాయక్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో విలేకరులతో ఎర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి జల్జీవన్ మిషిన్ కింద తెలంగాణ రాష్ట్రానికి 3982 కోట్లు పండ్ విడుదల చేయాగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 200 కోట్లు మాత్రమే తీసుకోవడం జరిగినదన అన్నారు. మెాడి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన తెలంగాణ రాష్ట్రంలో అమలుపరిచితే నేడు రైతులకు ఎంతో న్యాయం జరిగేదన్నారు.  కాలేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలో మారిందని, అదేవిధంగా మొన్నటి అకాల వర్షాలకు వరదలకు గోదావరి పరివాహక ప్రాంతం రైతులకు నాలుగు సంవత్సరాల దాకా పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. ముంపు ప్రాంతం బాదితులకు నేటి వరకు వారికి నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు లేవుని విమర్శించారు. వర్షాలతో వరదలతో ఇండ్ల ద్వంసం ఆస్థి, పత్తి, వరి, ఇతర పంటలకు నష్టం జరిగిన వరద బాధితులకు ఇప్పటి వరకు సహాయం అందలేదని అన్నారు. ఎన్నికల్లో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అసెంబ్లీ సాక్షిగా ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి కూడా రెండుసార్లు  ముఖ్యమంత్రి అయ్యారని, పోడు భూముల పట్టాలు కుర్చీ వేసుకుని ఇస్తానన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం గిరిజనులను అందుకోవడంలేదన్నారు. మునుగోడు లో ఎన్నికలు వస్తే కొత్త మండలాలు పది లక్షల పేన్షన్లు ఇస్తానని ప్రెస్ మీట్ కేసీఆర్ చెప్పడం జరిగిందని బిజేపి తరుపున కేసీఆర్ ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తేనే కేసీఆర్ పేన్షన్లు అభివృద్ధి గుర్తుకొస్తాయి. రైతులకు పంట నష్టం ఇవ్వకుంటే కచ్చితంగా  స్థానిక ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రెస్ మీట్ హెచ్చరించించారు. ఈ కార్యాక్రమంలో జిల్లా కార్యదర్శి కోంతం శంకరయ్య, మండల అధ్యక్షుడు గోలి చందు, కిసాన్ మెార్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్, మండల ఎస్టీ మెార్చా అధ్యక్షుడు బోడ తిరుపతి, మాజీ మండల అధ్యక్షుడు మంద పెళ్లి వీరాచారీ, పట్టణ అధ్యక్షుడు రాగుల సూర్యం, ఐటి సెల్ మండల కన్వీనర్ బూర్రగడ్డ జగన్, చింతలపల్లి అధ్యక్షుడు గూడ గంగాధర్, శక్తి కేంద్రం ఇన్సార్జులు కనకయ్య గౌడ్, బట్టల గంగాధర్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు బత్తిని నాగన్న, మండల బిజేపి నాయకులు గట్టు గంగమల్లు, దాసరి సత్తన్న, సందే గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area