*యువతకు అంబేద్కరే ఆదర్శప్రాయుడు* -సామాజిక హక్కుల ప్రధాత. -నూతన అంబేద్కర్ విగ్రహావిష్కరణలో భ

Published: Thursday April 13, 2023
చేవెళ్ల ఏప్రిల్ 12, (ప్రజాపాలన):-

చేవెళ్ల నియోజవర్గంలోని షాబాద్ మండలం సీతారాంపూర్  గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ భీంరావ్ అంబేద్కర్ గారి జయంతి  సందర్బంగా నూతన  విగ్రహాని ఆవిష్కరించి పూలమాలలు  వేసి నమస్సుమాంజలి  తెలిపారు. ఈ సందర్బంగా భీం  భరత్  గారు మాట్లాడుతూ దళిత, పీడిత వర్గాల ఆశజ్యోతి,దళిత బంధావుడు, అంటరాని తనని కులా వివక్షను రూపుమాపిన  మహానుభావులు  అందరు చదువుకోని   జ్ఞానాని నేర్చుకోవాలని  ఈ దేశం కులల మీద  మతాల  మీద  కాదు భారతరాజ్యాంగం ద్వారా పరిపాలించబడుతుంది అన్నారు.డాక్టర్ B R అంబేద్కర్ గారు కుల వివక్ష వలన  బడి  నుండి వెలివేయా బడిన  పట్టువదలని  విక్రమార్కుని వలే చితి మంటల వెలుగులో అక్షర  జ్ఞానాని నేర్చుకొని భారతదేశం గర్వించదగ్గ రాజ్యాంగని లిఖిచబడ్డారు.ఆయన  స్ఫూర్తిని స్మరిస్తూ ప్రతి  ఊరిలో  ఆయన  విగ్రహాని ప్రతిష్టించి ఆయన ఆశయలను  కొనసాగించాలి తెలిపారు.