గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యం

Published: Saturday October 09, 2021
రాళ్ళచిట్టంపల్లి సర్పంచ్ ముఫ్లయా యాస్మిన్ గౌస్
వికారాబాద్ బ్యూరో 08 అక్టోబర్ ప్రజాపాలన : రాళ్ళచిట్టంపల్లి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని సర్పంచ్ ముఫ్లయా యాస్మిన్ గౌస్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని రాళ్ళచిట్టంపల్లి గ్రామంలో కంపోస్ట్ షెడ్ చుట్టూ బయో ఫెన్సింగ్, కంపోస్ట్ ఎరువు తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కంపోస్ట్ షెడ్ చుట్టూ బయో ఫెన్సింగ్ కొరకు మొక్కలు నాటవలసి ఉందని పేర్కొన్నారు. మొదటి రెండు వరుసల్లో కానుగ, మూడవ వరుసలో మైదాకు మొక్కల్ని నాటుతామని వివరించారు. మొత్తం 250 మొక్కల్ని నాటుతామని స్పష్టం చేశారు. కంపోస్ట్ షెడ్ లో తయారైన కంపోస్ట్ ఎరువును పల్లె ప్రకృతి వనంలో పెరిగే మొక్కలకు, రోడ్డుకు ఇరువైపుల ఉన్న మొక్కలకు వేస్తామని ఉద్ఘాటించారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున కంపోస్ట్ ఎరువును తయారు చేసేందుకు కృషి చేస్తామని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకుడు గౌస్, పంచాయతీ కార్యదర్శి సుప్రియ, ఉప సర్పంచ్ మహమ్మద్ శంషొద్దిన్, వాచ్ అండ్ వార్డు మన్నన్ లు పాల్గొన్నారు.